Saturday, 12 September 2026 10:22:06 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

చిన్న గూడూరు మండలంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన.

Date : 23 October 2025 05:53 PM Views : 334

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / చిన్న గూడూరు : గురువారం జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ చిన్న గూడూరు కె.జి.బి.వి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్ వాడీ సెంటర్ ను, ఉగ్గంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా కె.జి.బి.వి, జిల్లా పరిషత్ పాఠశాలలను పరిశీలించి, విద్యార్థుల సంఖ్య, పనిచేస్తున్న ఉపాద్యాయుల వివరాలను ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులను, కిచెన్ షెడ్, స్టోర్ రూంను పరిశీలించి వంట సరుకుల నాణ్యతను పరిశీలించారు. తాజా కూరగాయలను మాత్రమే వాడాలని, అన్ని సరుకులు తగు పరిమాణం లో ఉండాలని సూచించారు. మెనూ ప్రకారం భోజన తయారీ ఉండాలన్నారు. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను, పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన పరిశుభ్రమమైన ఆహారాన్ని అందించాలని అన్నారు. ఉపాద్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన ఉండాలని, విద్యార్థుల యొక్క సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని అన్నారు. పాట్యాంశాలలోని పలు అంశాలపై ప్రశ్నలను అడిగి తెలుసుకున్నారు. అంగన్ వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లల హాజరు, నమోదు, గర్భిణీ, బాలింతల సంఖ్య వంటి వివరాలను అంగన్వాడీ టీచర్ ను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు వడ్డించే భోజనం పరిశుభ్రంగా ఉండాలని, చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని అన్నారు.అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి, అటెండెన్స్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాధి నిరోధక టీకాలు, నిలువ చేసే ఫ్రీజర్స్, వ్యాక్సిన్ నిల్వ పద్దతులను పరిశీలించి తగు సూచనలు చేశారు. మందుల రికార్డులను పరిశీలించారు.ఈ పర్యటనలో కలెక్టర్ వెంట పాటశాల ప్రిన్సిపాల్, ఉపాద్యాయులు, అంగన్ వాడీ సిబ్బంది, పి.హెచ్.సి వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు .

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :