Friday, 11 September 2026 09:50:12 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

జహంగీర్ పీర్ దర్గాలో సందల్ (గంధం) ఉత్సవాలు...

సందల్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

Date : 16 January 2026 10:44 PM Views : 214

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ చీఫ్ బ్యూరో జనవరి 16 :- షాద్ నగర్ కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ గ్రామ పరిధిలోని జహంగీర్ పీర్ దర్గాలో మూడు రోజుల పాటు జరిగే ఉర్సు ఉత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం సందల్ (గంధం) కార్యక్రమం నిర్వహించారు. గురువారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రారంభమైన గంధం కార్యక్రమాన్ని దర్గాలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సందల్ (గంధం) కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మా వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చందు తిరుపతి రెడ్డి, నందిగామ సర్పంచ్ కొమ్ము కృష్ణ, కాంగ్రెస్ నాయకులు ఆగిరు రవికుమార్, లింగారెడ్డి గూడా ఉపసర్పంచ్ అశోక్, ఖాదర్ మరియు ముఖ్యఅతిథిగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ పాల్గొన్నారు ప్రతి సంవత్సరం జరిగే ఈ గంధం ఉత్సవాలలో పాల్గొనడానికి తెలంగాణ రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుండి ముస్లింలు విచ్చేసి ఈ గంధం ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం నేటి సాయంత్రం నుండి ప్రారంభమై శుక్రవారం ఉదయం వరకు వివిధ కార్యక్రమాలతో ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో జనం రావడం విశేషం అయితే ఈ సందల్ కార్యక్రమానికి ముందు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ గంధం కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే శంకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే ఉర్సు కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అలాగే దర్గాలో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని వచ్చే వాహనాలను నియంత్రించడానికి ఎక్కడికక్కడ పార్కింగ్ సౌకర్యాలను మెరుపు పరచాలని సూచించారు. ముఖ్యంగా ఈ రోడ్డు గుండా భారీ వాహనాలను అనుమతించరాదని ఆదేశించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉర్సు ఉత్సవ కార్యక్రమాలలొ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పట్టిష్టమైన బంధబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులకు ఎక్కడికక్కడ సూచనలు చేస్తూ షాద్నగర్ డిసిపి శిరీష, ఏసిపి లక్ష్మీనారాయణ, మరియు కొత్తూరు సీఐ నర్సయ్య, జేపీ దర్గా సూపరిండెంట్ ఎండి. సత్తార్ పర్యవేక్షిస్తున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :