Friday, 11 September 2026 09:06:29 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

*'మను చరిత్ర' ఒక చరిత్ర కాదు..మనిషి అంతరంగ యాత్ర*

Date : 22 January 2026 11:42 AM Views : 549

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ప్రబంధ సాహిత్యంలో మను చరిత్రకు ఉన్న స్థానం అపూర్వమైనది. మార్కండేయ పురాణాంతర్గతమైన ఈ కథను మహాకవి అల్లసాని పెద్దన తన వర్ణనా వైభవంతో మహాప్రబంధంగా మలిచారు. కవి ప్రతిభకు, కృతి భర్తగా శ్రీకృష్ణదేవరాయలు ఆశ్రయానికి ఈ కావ్యం అజరామర కీర్తిని తెచ్చింది. ఈ కావ్యం స్వారోచిష మను సంభవాన్ని నేపథ్యంగా తీసుకొని,ప్రధానంగా మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఒక్కటి ప్రవరుడు, రెండు సిద్ధుడు, మూడు వరూధిని ఈ పాత్రలతో కథ నడుస్తుంది. *ప్రవరుడు ఆదర్శ జీవి* ప్రవరుడు ఒక ఆదర్శ గృహస్థుడు. తల్లిదండ్రుల సేవలో తరించేవాడు. నిత్యాగ్నిహోత్ర పరాయణుడు. అతిథి సేవను ధర్మంగా భావించేవాడు. అరుణాస్పద పట్టణాన్ని ఎప్పుడూ విడిచిపెట్టని నియమవంతుడు. తీర్థయాత్రల కథలు, హిమాలయ సౌందర్య వర్ణనలు అతని అంతరంగంలో కోరికగా మారాయి. అదే సమయంలో అతని ధర్మనిష్ఠ అతడిని ఊరు విడిచి వెళ్లకుండా కట్టడి చేసింది. *సిద్ధుని ఆగమనం* ఒకనాడు అతిథిగా వచ్చిన సిద్ధుడు తన యాత్రల విశేషాలు చెబుతాడు. చిన్న వయసులోనే ఇన్ని ప్రదేశాలు ఎలా చూశావని ప్రవరుడు అడిగితే, తన వద్ద ఉన్న దివ్య పసరు మహిమను వివరిస్తాడు. కుతూహలంతో నిండిన ప్రవరుడు ఆ పసరును తనకు ఇవ్వమని కోరతాడు. సిద్ధుడు పసరును అతని పాదాలకు పూసి వెళ్లిపోతాడు. కానీ దాని పరిమితి గురించి చెప్పడు. *హిమాలయ యాత్ర* పసరు ప్రభావంతో ప్రవరుడు హిమాలయాలకు చేరతాడు. ప్రకృతి సౌందర్యంలో పరవశిస్తాడు. కానీ మంచు తాకడంతో పసరు కరిగిపోతుంది. తిరిగి వెళ్లలేని అయోమయ స్థితిలో ఉండగా ఒక లోయలో అపూర్వ సౌందర్యరాశి వరూధిని దర్శనమిస్తుంది. *అంతర్మథనం.....ధర్మ విజయం* వరూధిని, ప్రవరుల సంవాదంలో వరూధిని అప్సరస వంశానికి చెందిన స్త్రీ తన అందంతో, వాక్చాతుర్యంతో ప్రవరుణ్ని మోహింపజేయాలని ప్రయత్నిస్తుంది. "మీ యజ్ఞ యాగాల ఫలితం స్వర్గంలో మా కౌగిళ్లలోనే కదా! ఆ సుఖాన్ని ఇప్పుడే ఎందుకు అనుభవించరు?" అని ప్రలోభపెడుతుంది. కానీ ప్రవరుడు కామశాస్త్రం తెలిసినవాడే. శృంగారాన్ని తిరస్కరించేవాడు కాదు. అయినా ఏకపత్నీ వ్రతానికి కట్టుబడినవాడు, ధర్మం వైపు నిలుస్తాడు. అంతఃసంఘర్షణ ఇది కేవలం బాహ్య సంఘటన కాదు. ఇది మనసులో జరిగే ఘర్షణ కోరిక, వివేకం, భోగం, ధర్మం. వరూధిని అతని అంతశ్చేతనలో దాగి ఉన్న భోగవాంఛకు ప్రతిరూపం. *వివేక విజయం* వరూధిని అతన్ని కౌగిలించుకున్న క్షణమే ప్రవరుడు ఉలిక్కి పడి "హా శ్రీహరీ"! అంటూ ఆమెను దూరం నెట్టివేస్తాడు. తన కోరికలను అగ్నిలో వేసి, యోగాగ్నితో శుద్ధి చేసుకొని, అగ్ని సహాయంతో తన గృహానికి చేరుకుంటాడు. *కావ్య సందేశం* మను చరిత్ర మనకు చెప్పేది ఇదే. కోరికలను గెలవడం కాదు, జయించాలి. ధర్మం తాత్కాలికంగా కాదు, సర్వకాలికం. గృహస్థ ధర్మమే, సమాజానికి మూలస్తంభం. గెలుపు అశాశ్వతం, విజయం శాశ్వతం. అందుకే మను చరిత్ర ఒక కథ కాదు, మనిషి అంతరంగ యాత్ర. --డా.ఓర్సు రాయలింగు 9849446027

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :