Sunday, 13 September 2026 12:32:22 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

ఎస్టీల సంక్షేమ కమిటీ సమావేశంలో పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే...

Date : 25 August 2026 09:34 PM Views : 78

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎస్టీల సంక్షేమ కమిటీ సమావేశం మంగళవారం హైదరాబాద్‌ అసెంబ్లీ హాలులో నిర్వహించగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, ఉపాధి, గృహ వసతి, మౌలిక వసతులు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించడం సమావేశం ప్రధాన ఉద్దేశ్యంగా సాగింది. సమావేశంలో గిరిజన ప్రాంతాల్లో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని పరిశీలించడంతో పాటు, అర్హులైన ఎస్టీ లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అందుతున్నాయా అనే అంశంపై చర్చించారని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. అలాగే గిరిజన గ్రామాల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్, విద్యా సంస్థలు, వైద్య సదుపాయాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. బోథ్ నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల సమస్యలను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. గిరిజనులకు సంబంధించిన పెండింగ్ సమస్యలను పరిష్కరించడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఎస్టీల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, గిరిజన ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశంలోచర్చించారు. గిరిజనుల సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటి పరిష్కారానికి శాసనసభ కమిటీ ద్వారా అవసరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ మంత్రి శ్రీధర్ బాబు గారు తదితరులు ఉన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :