Wednesday, 29 July 2026 12:52:45 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయండి...

ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి సీఎం వినతి

Date : 18 April 2026 09:53 PM Views : 148

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్ డీ, కుమార స్వామికి శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని అంత ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీ పర్యటనలో భాగంగా కీలక అడుగులు వేశారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి , సహాయ మంత్రి శ్రీనివాస వర్మలతో ఈరోజు భేటీ అయిన ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతి ష్టాత్మక ప్రతిపాదనలను వారి ముందుంచారు. ముఖ్యంగా బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ పరిశ్రమ స్థాపన ద్వారా ఉక్కు కొరత తీరడమే కాకుండా, పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుం దని ఆయన వివరించారు. ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్‌లో భాగంగా రూపొందించిన పారిశ్రామిక ప్రణాళికలను వివరిస్తూ, పాత వాహనాల స్క్రాప్‌తో ఉక్కును రీసైక్లింగ్ చేసే సరికొత్త పరిశ్రమను తెలం గాణలో నెలకొల్పాలని కేంద్ర మంత్రులను కోరారు. హైదరాబాద్ నగరాన్ని దేశ పారిశ్రామిక ఉత్పత్తికి కంచుకోటల మార్చేందుకు ఉన్న అనుకూలతలను సీఎం ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. హైడ్రోజన్ టెక్నాలజీతో గ్రీన్ స్టీల్ క్లస్టర్, ఆటోమొబైల్ , రక్షణ రంగాలకు అవసరమైన ఉత్పత్తుల తయారీ పరి శ్రమలను ప్రోత్సహించా లని కోరారు. ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగాపెరుగుతున్న నేపథ్యంలో, ఈవీ బ్యాట రీల తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం అత్యవసరమని ఆయన వివరించారు. ఈ కీలక భేటీలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు , కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ కూడా పాల్గొన్నారు. సీఎం చేసిన వినూత్న ప్రతిపాదనలపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: