ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆర్టీసీ కార్మికులు గత మూడు రోజుల నుండి తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా జేఏసీ పిలుపుమేరకు సమ్మె చేస్తున్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను రేవంత్ రెడ్డి సర్కార్ వెంటనే పరిష్కరించాలని శుక్రవారం నిర్మల్ డిపో ముందు జరిగిన సమ్మె శిబిరంలో టి యు సి ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే రాజన్న పాల్గొని రేవంత్ రెడ్డి సర్కార్ను డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడంతో కార్మికులు ఎంతో ఆవేదన చెందుతున్న సమయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటానని ప్రభుత్వంలో విలీనం చేస్తా అని మాట ఇచ్చి మరిచారని ఎద్దేవ చేశారు. ఆర్టీసీ భద్రత తో ప్రయాణ సౌకర్యాలను అందించిందని అనేక అవార్డులు అందుకున్నదని కొవ్వత్తి తను కాలిపోతూ వెలుగునిస్తుంది సరిగ్గా ఆర్టీసీ కార్మికులు రెక్కలు ముక్కలు చేసుకొని తీవ్ర పని ఒత్తిడితో పని గంటలపెంపుఅధికారుల ఇష్టానుసారము చర్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతూ సతమతమవుతూ పనిచేస్తున్నారని అన్నారు. చాలీచాలని వేతనాలతో తీవ్ర పని ఒత్తిడికి గురై అనేక అనారోగ్య కారణాలతో గుండె జబ్బులతో తనువు చాలిస్తున్నారని అన్నారు. లాభం దృష్టితో కాకుండా ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు అందించడంలో ఆర్టీసీ కీలకమైన పాత్ర పోషిస్తుందని లక్షలాదిమంది ని తమ గమ్యస్థానాలకు చేరవేసి ఆర్టీసీ అన్నలకు ఎలాంటి భద్రత రక్షణ లేని స్థితిలో నేడు కొట్టుమిట్టాడుతున్నారని ఆర్టీసీ అధికారులు ఏ మాత్రం మానవత్వం లేకుండా కార్మికులను పీల్చి పిప్పి చేస్తున్నారని మండిపడ్డారు. కోటానుకోట్ల సంపదను సృష్టించిన ఆర్టీసీ కార్మికుల బాధలు చెప్పలేనన్నివి ఉన్నాయని వీరి న్యాయమైన డిమాండ్లు వెంటనే ప్రభుత్వం చర్చలు జరిపి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిచో కేసిఆర్ ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని ఆర్టీసీ కార్మికుల గోస తగులుతుందని రేవంత్ రెడ్డి సర్కార్ను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం. జిల్లా కార్యదర్శి కె లక్ష్మి .పిడిఎస్యు జిల్లా కన్వీనర్ కిరణ్. ఏఐటీయూసీ గౌరవాధ్యక్షులు ఎస్ ఎన్ రెడ్డి.ఆర్టీసీ జేఏసీ నాయకులు కార్మికులు పాల్గొన్నారు.
Admin
E Nivas News