ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా చెన్నూరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జుల్ఫికర్ అహ్మద్ శుక్రవారం మృతి చెందిన విషయం తెలుసుకొని తెలంగాణ రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ రెడ్ హిల్స్‌లోని జుల్ఫికర్ అహ్మద్ నివాసానికి వెళ్లి, వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వెలిబుచ్చారు. జుల్ఫికర్ అహ్మద్ సామాజిక సేవా దృక్పథం కలిగిన నాయకుడని, చెన్నూరు ప్రాంత ప్రజల అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం జీవితాంతం కృషి చేశారన్నారు. ఆయన మరణం స్థానిక ప్రజలకు, కాంగ్రెస్ కుటుంబానికి సమాజానికి ఒక తీరని లోటు అని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలం కలగాలని ఆకాంక్షిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. జుల్ఫికర్ అహ్మద్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన సేవలు సమాజానికి చిరస్మరణీయమని మంత్రివర్యులు తెలిపారు. మంత్రి వెంట నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News