ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : తెలంగాణ 69వ రాష్ట్రస్థాయి అటల పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర (మంథని) లో 10వ తరగతి చదువుతున్న ఏర మనోజ్ కుమార్ ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు ఎం శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన అండర్ 17 బాలుర వాలీబాల్ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచి ఈనెల నేటి నుంచి 18 వరకు సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరువు లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఆటల పోటీలలో పాల్గొననున్నట్లు అయన తెలిపారు. మనోజ్ రాష్ట్ర స్థాయిలో ఆటల పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల పిడి ఏ మాధురి, పాఠశాల సిబ్బంది అభినందించారు.
Admin
E Nivas News