ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని మండల స్థాయి క్రీడా పోటీల సెలెక్షన్ సెప్టెంబర్ 2, 3 తేదీలలో అండర్ -14, అండర్ -17 విభాగాలలో మంథని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జరుగనున్నట్లు ఎంఈఓ దాసరి లక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 2 న బాలికలకు కబడ్డీ, కోకో, వాలీబాల్, 3న బాలురకు కబడ్డీ ,కోకో, వాలీబాల్ పోటీల్లో సెలక్షన్స్ జరుగుతాయని ఎంఈఓ పేర్కొన్నారు. ఈ పోటీలలో పాల్గొనే విద్యార్థులు ఫోటోతో కూడిన ఎలిజిబులిటీ ఫాంలో ఆయా పాఠశాలల ప్రదానోపాద్యాయుల సంతకంతో హాజరుకావాలని కొరారు.
Admin
E Nivas News