Tuesday, 28 July 2026 07:16:55 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

మరిపెడ మున్సిపాలిటీలో రూ. 50 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

13వ వార్డు కాంగ్రెస్ బజార్‌లో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెండ్లి రఘువీరారెడ్డి

Date : 24 January 2026 09:07 PM Views : 312

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కాంగ్రెస్ బజార్‌లో సీసీ రోడ్డు నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మరిపెడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెండ్లి రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. మరిపెడ మున్సిపాలిటీగా ఏర్పడినప్పటి నుంచి గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క వార్డులో కూడా అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రూ.50 కోట్ల నిధులను మరిపెడ మున్సిపాలిటీకి మంజూరు చేసినట్లు తెలిపారు. అభివృద్ధి పనులు ప్రారంభమవడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, అన్ని వార్డుల్లో దశలవారీగా మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మరిపెడ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ తాజుద్దీన్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గుగులోతు రవి నాయక్, జిల్లా మైనారిటీ నాయకులు అఫ్జల్, మండల మైనార్టీ నాయకులు అజీజ్, మున్సిపాలిటీ యూత్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, ఎల్లంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గండి వీరభద్రం, దేవరశెట్టి వెంకన్న, కుడితి వెంకట్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సల్మాన్, కొరివి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: