Monday, 14 September 2026 04:21:45 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

హెల్మెట్ ధరించిన వారికి పుష్పాలు… లేనివారికి హెల్మెట్ పంపిణీ...

ప్రాణ భద్రత కోసం హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి

Date : 24 February 2026 07:25 PM Views : 227

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి నెల చివరి వారం నిర్వహించే “అరైవ్–అలైవ్” రెండవ విడత కార్యక్రమంలో భాగంగా మంగళవారం గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మున్సిపల్ టీ జంక్షన్ వద్ద వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ “అరైవ్–అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరై,రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ ధరించడం అత్యంత అవసరమని ప్రజలకు, వాహనదారులకు వివరించారు. హెల్మెట్ ధరించి వచ్చిన వాహనదారులకు పుష్పాలు అందించి అభినందించారు. అలాగే హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి హెల్మెట్‌లు పంపిణీ చేసి, భద్రతానిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సీపీ మాట్లాడుతూ పోలీసులు హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే చలాన్ విధిస్తారని తెలిపారు. అయితే చలాన్ వల్ల పోలీసులకు లాభనష్టం ఏమీ ఉండదని, కానీ హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల ప్రమాదం జరిగితే గాయాలు గానీ,ప్రాణ నష్టం గానీ కలిగి మీకూ,మీ కుటుంబానికీ తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.ఇంటి నుంచి వాహనంతో బయటకు వచ్చిన ప్రతిసారి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. హెల్మెట్‌ను సరిగా ధరించి,సేఫ్టీ లాక్ బిగించి వాహనం నడపాలని తెలిపారు. మీ బంధువులు, స్నేహితులు లేదా పరిచయస్తులు ఎవరైనా ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తే వారికి కూడా హెల్మెట్ వినియోగం తప్పనిసరిగా చేయాలని తెలియజేయాలని కోరారు. ప్రాణ భద్రత కోసం ప్రతిఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్,ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ అనిల్ కుమార్,మంచిర్యాల ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, వన్‌టౌన్ ఎస్సైరమేష్ రాముని, ట్రాఫిక్ ఎస్సై హరిశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: