ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మోంథా తుఫాన్ వల్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపట్ల నియోజకవర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బెల్లంపల్లి మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య బుధవారం ఒక ప్రకటన లోకోరారు. పురాతన ఇళ్లలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. వాగులు, చెరువులు, లోతట్టు ప్రాంతాలు, కల్వర్టులు వంటి ప్రాంతాలకు ప్రజలు వెళ్ళకూడ దన్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుండి ప్రజలు బయటికి రాకూడదని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు. రైతన్నలు జర భద్రంగా ఉండాలని, రైతులు పొలాలలో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలన్నారు. విద్యుత్ స్తంభాలను గాని, వైర్లను కానీ తడిచిన చేతులతో ముట్ట వద్దన్నారు.నీరు నిలువ ఉన్న విద్యుత్ స్తంభాల దగ్గర నుండి వెళ్ళవద్దని తెలిపారు.
Admin
E Nivas News