Thursday, 30 July 2026 12:33:51 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

అమెరికా సామ్రాజ్యవాద విధానాలు నశించాలి - ఇరాన్ పై యుద్ధం ఆపాలి...

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జోన్ వేస్లీ

Date : 31 March 2026 10:29 PM Views : 195

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : అమెరికా సామ్రాజ్య విధానాలు నశించాలని, ఇరాన్ పై యుద్ధం వెంటనే ఆపాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పూలె భవనంలో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీహాజరై మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాదం అనుసరిస్తున్న విధానం వల్ల ప్రపంచ శాంతికి విగాథం కలిగిస్తుంది.అమెరికా తన ఆయుధ సంపత్తిని పెంచుకోవడానికి తమ దగ్గర ఉన్న ఆయుధాల నిలువలను అమ్ముకోవడానికి అన్ని దేశాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి పెత్తనం చేస్తుంది. యుద్దాలను సృష్టించడం కోసం వెనిజులా, ఇరాన్,క్యూబా తమకు గిట్టని దేశాలపై కవ్వింపు సైనిక చర్యలు చేస్తూ ప్రపంచంలోని అన్నిదేశాల పైనతమ పెత్తనం కొనసాగిస్తూ అంతర్జాతీయ న్యాయ సూత్రాలన్నిటిని ఉల్లంఘించి ఏకదృవ ప్రపంచం సాధించడం కోసం అమెరికా తప్పుడు పద్ధతుల్లో ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తుంది. యుద్దాలను తన వ్యాపారాన్ని విస్తరింప చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ట్రంపు తమ మాట వినని దేశాలపై విచ్చలవిడిగా పన్నుల శాతాన్ని పెంచి వేస్తుంది. దీనివల్ల అన్ని రకాల వస్తువులపై అధిక ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. ఇన్ని రోజులుగా జరుగుతున్న యుద్ధం వల్ల గ్యాస్ ,పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడి భారతదేశ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురి గురవుతున్నారు. అక్కడ ఎక్కడో యుద్ధం జరిగితే మన ఇండ్లలో సరుకుల ధరలు పెరుగుతున్నాయి. భారతదేశంలో ఎగుమతులు దిగుమతుల పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యుద్ధం వల్ల ఎవరికి లాభంలేదు అమెరికా అధ్యక్షుడు ట్రంపు తప్పుడు విధానాల వల్ల మన దేశ సాధారణ ప్రజలు పేద ప్రజల జీవితాలు చితికి పోతున్నాయి.భారతదేశ పాలకులు స్వతంత్ర విధానం తీసుకోవాలి.అమెరికా ట్రంప్ ఒత్తిళ్లకు తలగొద్దు.మన ప్రజలపైభారాలుపడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.ఉపాధి ఉద్యోగాలను కాపాడాలన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని అంగన్వాడీ, ఆశ ఉద్యోగ కార్మికులు వేతనాలు పెంపు విషయమై చలో హైదరాబాద్ ధర్నాకు పిలుపునిస్తే రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా పోలీసులు చేత నాయకులపై కార్యకర్తలపై దాడి చేయడం చాలా దుర్మార్గమని అన్నారు. ఈ దాడిని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అదే విదంగా గ్రామపంచాయతీ, మున్సిపల్, ఐకేపీ వివోఏలు, భవన నిర్మాణ కార్మికులు, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులు చేస్తున్న ఆందోళన పోరాటాలకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పోరాటాల పైన స్పందించి, తమ న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారి రవి కుమార్ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మంచిర్యాల జిల్లా అభివృద్ధికి, కాలేశ్వరం ముంపు సమస్యకు,పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఎన్ని నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించారో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీ,మంత్రులు చెప్పాలన్నారు. అదేవిధంగా పోడు చేసుకుంటున్న ఆదివాసి గిరిజన పేదలకు హక్కు పత్రాలు ఇవ్వకుండా, ఆదివాసి పేదలపై కక్షపూరితంగావ్యవహరిస్తూ అటవీశాఖ అధికారులు ఇబ్బందుల గురిచేస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి నీరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు,పెన్షన్స్ ఇవ్వాలన్నారు.ఈ సమావేశంలో పైల్ల ఆశయ్య సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, సంకె రవి జిల్లా కార్యదర్శి,కె,అశోక్,ఎ.పున్నం, బోడంకి చందు,జి. ప్రకాష్, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు , ఉమారాణి, మల్లేశ్వరి,లింగన్న, రంజిత్ కుమార్, శ్రీనివాస్, ప్రేమ్ కుమార్, రాజారాం జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: