Tuesday, 28 July 2026 07:04:12 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

విద్యుత్ శాఖలో మరణించిన వారికి కోటి రూపాయల బీమా చెక్కు పంపిణి చేసిన సీఎం...

Date : 23 March 2026 09:38 PM Views : 131

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం 1 కోటి రూపాయల చొప్పున ప్రమాద బీమా చెక్కులు అందజేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల సమక్షంలో బాధితులకు చెక్కులు అందించారు.మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఓర్సు సురేష్, ముఖ్తార్ బేగ్ కుటుంబ సభ్యులకు 1 కోటి రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షలకు పెంచాం. సీపెక్ సర్వే ప్రకారం తేలిన కుటుంబాలన్నింటికీ 5 లక్షల రూపాయల బీమా వర్తిస్తుంది. కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఆ కుటుంబం వీధిన పడకూడదని కుటుంబ బీమా తీసుకొచ్చాం అన్నారు.ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లో మనోధైర్యాన్ని నింపేందుకే అసెంబ్లీ సమావేశాల సమయంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి , వివేక్ వెంకటస్వామి మహమ్మద్ అజహరుద్దీన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :