Tuesday, 15 September 2026 08:26:51 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

బోథ్ మండల కేంద్రాన్ని మోడల్ గా తీర్చి దిద్దుతా

రూ. 10 కోట్లతో బోథ్ పట్టణ సుందరీకరణ

Date : 11 October 2025 08:01 PM Views : 296

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : బోథ్ మండల కేంద్రాన్ని మోడల్ గా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. శనివారం ఎమ్మెల్యే మండల కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా బోథ్ పట్టణంలోని కూడళ్లను, వీధులను నాయకులు, రోడ్లు భవనాలు శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. కాలనీల్లో గల బీడీ కార్మికులు, స్థానికులతో ఎమ్మెల్యే ముచ్చటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ బోథ్ పట్టణాన్ని మోడల్ బోథ్ గా తీర్చిదిద్దుతామని, అందుకే నేడు పట్టణంలోని అన్ని కాలనిల్లో గల రోడ్లను స్వయంగా పరిశీలించడం జరిగిందని అన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ఆర్ అండ్ బి, పి ఆర్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. రూ. 10 కోట్లతో త్వరలోనే రోడ్లు నిర్మిస్తామని, రూ. 18 కోట్లతో సెంటర్ లైటింగ్ తో సుందరికరణ కొరకు సైతం పాటుపడతామన్నారు. అన్ని కూడళ్ళ రోడ్లను త్వరితగతిన పూర్తి చేస్తామని, రానున్న రోజుల్లో కచ్చితంగా మోడల్ బోథ్ గా తీర్చుదిద్దుతామని స్పష్టం చేశారు. డిగ్రీ కాలేజి కొరకు సైతం ప్రభుత్వంతో కొట్లాడుతున్నాం, ఫైర్ స్టేషన్ కొరకు సైతం ప్రయత్నాలు కొనసాగిస్తున్నామన్నారు. ఎలక్షన్ల సమయంలోనే రాజకీయం, తర్వాత అభివృద్దే ద్యేయంగా ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి శాఖ డి ఈ అరవింద్, పి ఆర్ డి ఈ ధర్మేందర్, ఏ ఈ చంద్రశేఖర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :