Monday, 14 September 2026 04:44:00 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ప్రభుత్వ భూముల అక్రమాలపై ప్రశ్నిస్తే నోటీసులా..? మీడియాను భయపెట్టే ప్రయత్నం సరికాదు

తెలంగాణ మాల జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చందా శ్రీనివాస్

Date : 08 January 2026 08:34 PM Views : 311

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో జరుగుతున్న ప్రభుత్వ భూముల అక్రమాలపై ఆధారాలతో వార్తలు ప్రచురించిన జర్నలిస్టు బోయిని నరేందర్ ముదిరాజ్‌కు లీగల్ నోటీసులు పంపడం సరికాదని తెలంగాణ మాల జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడు చందా శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. గురువారం కురవి మండల కేంద్రంలో తెలంగాణ మాల జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టు నరేందర్ ముదిరాజ్ సంఘానికి తెలిపిన వివరాల ప్రకారం, కురవి మండలంలోని 747 సర్వే నంబర్‌కు చెందిన విలువైన ప్రభుత్వ భూమిని సుమారు మూడేళ్ల క్రితం ఓ రెవెన్యూ శాఖ ఉద్యోగి అక్రమంగా విక్రయానికి గురి చేసిన విషయాన్ని జర్నలిస్టులు పక్కా ఆధారాలతో వెలుగులోకి తెచ్చారని తెలిపారు. ప్రభుత్వ భూముల అక్రమాలపై ప్రశ్నించిన జర్నలిస్టుకు లీగల్ నోటీసులు పంపడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, ఇది స్వేచ్ఛాయుత మీడియాను భయపెట్టే ప్రయత్నంగా ఆయన అభివర్ణించారు. ప్రజల తరఫున ప్రశ్నించే మీడియాను అణచివేయాలని చూస్తే జర్నలిస్టు సంఘాలు మౌనంగా ఉండవని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల అక్రమాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల హక్కులు, భద్రత కోసం తెలంగాణ మాల జర్నలిస్టు యూనియన్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని చందా శ్రీనివాస్ ప్రకటించారు. ఈ సమావేశంలో తెలంగాణ మాల జర్నలిస్టు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బేతమళ్ళ సహాదేవ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు బొడ్డు అశోక్, జిల్లా నాయకులు గండమాల రోషయ్య, జర్నలిస్టు బోయిని నరేందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :