ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఈ కేవైసీ పూర్తి చేసుకొని రైతులకు పీఎం కిసాన్ యోజన 24వ విడత అక్టోబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే రైతులు ఈ కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి. ఇందుకోసం రైతులు ఓటిపి ద్వారా లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ ( సిఎస్సి )లో ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. అలాగే బ్యాంకు ఖాతా ఆధార్‌తో అనుసంధానమై ఉండటంతో పాటు డి బి టి సౌకర్యం యాక్టివ్‌గా ఉండాలి. ఖాతాలో పేరులో తేడాలు లేదా ఇతర సాంకేతిక సమస్యలు ఉంటే నగదు జమ కావడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల రైతులు ముందుగానే తమ వివరాలను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ-కేవైసీ పూర్తి చేయని రైతులకు తదుపరి విడత సాయం నిలిచిపోయే అవకాశం ఉందన్న విస్మయం పలువురు వ్యక్తం చేస్తున్నారు.
Admin
E Nivas News