Wednesday, 29 July 2026 11:28:57 PM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాల కొరకు మరో వర్గీకరణ చేపట్టాలి

కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోటికార్ కిషన్ జీ

Date : 16 November 2025 07:50 AM Views : 231

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : 113 కులాలుగా ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ప్రవేశ పెట్టడం అభినందనీయమని, బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాల కొరకు తీవ్ర అన్యాయం జరుగుతున్నందున మరో వర్గీకరణ అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోటికార్ కిషన్ జీ పేర్కొన్నారు. బీసీలలో ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందిన కులాలే ఎక్కువ లబ్ధి పొందుతున్నారని, అట్టడుగున ఉన్న కొన్ని బీసీ కులాలకు ఎలాంటి లబ్ధి చేకూరడం లేదనే చర్చ నడుస్తుందన్నారు. మున్నూరు కాపు, యాదవ, గౌడ, ముదిరాజ్ వంటి సామాజిక వర్గాలు కొంతమేర అభివృద్ధి చెందినప్పటికీ బీసీ రిజర్వేషన్ల పలాలు వారే పొందుతున్నట్లు ఇతర బీసీ కులాలు భావిస్తున్నాయన్నారు. చాకలి, మంగలి, కుమ్మరి, గంగాపుత్ర, మేర, ఆరెకటిక లాంటి కులాలకు రిజర్వేషన్ల లబ్ధి చేకూరడం లేదన్నారు. అందువల్ల బీసీలలో ఉన్న ఏ,బి,సి,డి,ఈ గ్రూపులను తిరిగి వర్గీకరించాలని ఎటువంటి రిజర్వేషన్ల లబ్ధి పొందని వారికి రిజర్వేషన్లు పొందే గ్రూపులలో చేర్చాలని ఆయన కొరారు. జనాభా ఎక్కువగా ఉన్న కొన్ని కులాలకి ఎక్కువ అవకాశాలు దక్కడం వల్ల బీసీ రిజర్వేషన్ల లక్ష్యం నెరవేరడం లేదన్నారు. ఇంతవరకు కొన్ని కులాలు శాసన సభ మెట్లు కూడా ఎక్కలేదని ఆయన ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లను శాస్త్రీయంగా అమలు చేసి అత్యంత వెనుకబడిన కులాల రిజర్వేషన్ల పలాలు అందేటట్టు చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అందుకు తగినట్టుగా ఏ,బి,సి,డి,ఈ తో పాటు మరొక వర్గీకరణ చేసి ఈ,జి గ్రూపులు ప్రవేశపెట్టి అత్యంత వెనుకబడిన కులాలను చేర్చి వారికి కొంత పర్సెంటేజీ ఇచ్చి ఆదుకోవాలని గోటికార్ కిషన్ జీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: