Sunday, 13 September 2026 01:13:19 AM
# కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు..

తెలంగాణ ప్రజలకు శుభవార్త..

బడ్జెట్‌లో కొత్త పథకాలు

Date : 20 March 2026 07:16 PM Views : 166

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో కొత్త పథకాలు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం12.00 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. ఆ వెంటనే అసెంబ్లీలో మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఈ 2026 - 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే శాసన మండలిలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి 2026 - 27 వార్షిక బడ్జెట్‌ను రూ.3,36,000 కోట్ల అంచనాతో రూపొందించినట్లు తెలుస్తోంది. గతేడాది 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.3,04,000 కోట్లతో బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ఏడాది బడ్జెట్‌లో విద్య, వైద్యం, సంక్షేమం, నీటి పారుదలకు పెద్ద పీట వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెరిగిన రాష్ట్ర ఆదాయంతోబడ్జెట్ అంచనాలు 10 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. ఇక జీఎస్టీ శ్లాబులు మారినా కానీ రాష్ట్ర ఆదాయానికి పెద్దగా ఇబ్బంది కలగలేదని సమాచారం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, తమ్ముడిహట్టి బ్యారేజ్ నిర్మాణం, మూసీ రివర్ ఫ్రంట్, రీజినల్ రింగ్ రోడ్, మెట్రో రైల్, పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ఈ బడ్జెట్‌లో భారీగా నిధుల కేటాయింపులు చేసే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :