Sunday, 13 September 2026 12:47:23 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు

మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో 200 మంది చేరికలు

Date : 07 January 2026 09:37 PM Views : 222

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : రెండు సంవత్సరాల పరిపాలనలోని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులను చూసి బిజెపి టిఆర్ఎస్ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారని మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ వివేక్ తెలిపారు. బుధవారం చెన్నూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిజెపి, తెరాస పార్టీల నుండి 200 మంది కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండవా కప్పి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తానని నన్ను గెలిపించారని నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గంలో చాలా చోట్ల అభివృద్ధి పనులు చేస్తున్నావని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడంజరిగిందన్నారు. 50 వేల టీచర్ పోస్టులను భర్తీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసిం దన్నారు. సింగరేణి పవర్ ప్లాంట్ లో నూతన 850 మెగా వాట్ల ప్లాంట్ కు భూమి పూజ చేశామన్నారు. సింగరేణిలో 80 శాతం స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా చూస్తున్నా మనీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నా మన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం ఇవ్వడం జరిగిం దన్నారు.10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వ లేదని అర్హులందరికీ కార్డులు ఇచ్చుకున్నా మన్నారు. సర్పంచ్ లకు 20 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తా మన్నారు. వారం రోజుల్లో ప్రొసీడింగ్ కాపీలు తీసుకొని గ్రామాల్లో అభివృద్ధి చేయాలని సూచించారు. మున్సిపాలిటీలో స్మశానవాటికలు లేక ఇబ్బందులు పడ్డారని నేను గెలిచాక నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో స్మశానవాటికలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. చెన్నూరు పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో అందరూ తమ వ్యాపారాలు చేసుకోవాలన్నారు. చెన్నూరు పట్టణంలో అభివృద్ధి చేసి ఆదర్శ పట్టణంగా తీర్చి దిద్దుతా ననిసుమారు 40 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేసుకున్నా మన్నారు. ప్రతీ కార్యకర్త మంచిగా పని చేసి ఎన్నికల్లో మన పార్టీ నాయకులను గెలిపించు కోవాలన్నారు. రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల కుప్పగా చేశారు. నిన్న కవిత కూడాసభలో మాట్లాడినప్పుడు మా అన్నా మా బావలు రాష్ట్రాన్ని దోచుకున్నారు. కేసీఆర్ మహిళలను, రైతులను కోటీశ్వరులు చేస్తానని మోసం చేశాడన్నారు.వాళ్ళు మాత్రం కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి బీ ఆర్ ఎస్ కు బుద్ధి చెప్తామన్నారు. ఎలెక్టోరల్ బాండ్స్ లో స్థానిక పార్టీలకు దేశంలోనే ఎక్కువ ఫండ్స్ తెచ్చుకున్నారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరిన వారందరూ పార్టీ బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, బిజెపి పార్టీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల సమ్మయ్య, మాజీ ఎంపీటీసీ రాజేష్ తో పాటు 200 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: