Saturday, 12 September 2026 10:22:04 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

ప్రజా భద్రతే లక్ష్యం... విజబుల్ పోలీసింగ్‌తో....ప్రజలకు భరోసా...

సిపి. అంబర్ కిషోర్ ఝా

Date : 22 November 2025 09:45 PM Views : 279

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ప్రజా భద్రతే లక్ష్యంగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ విజబుల్ పోలీసింగ్‌తో అధికారులు తక్షణమే స్పందించి ప్రజలకు భరోసా కల్పించాలి అని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్‌ కమీషనరేట్ మంచిర్యాల జోన్ దండేపల్లి పోలీస్‌ స్టేషన్‌ను శనివారం తనిఖీ చేశారు. తనిఖీలకై పోలీస్‌ స్టేషన్‌ చేరుకున్న పోలీస్‌ కమిషనర్‌కు పోలీస్ అధికారులు పూలమొక్కలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ సిబ్బంది తో మాట్లాడి వారి విధులు, పనితీరు, సమస్లు అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా సీపీ పోలీస్‌ స్టేషన్‌ రిసెప్షన్‌, ఇతర విభాగాల పనీతీరును సంబంధిత పోలీస్‌ సిబ్బందిని శాఖపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తనిఖీలో భాగంగా పోలీస్‌ స్టేషన్‌ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేయడంతో పాటు, పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులకు సంబంధించి సిపి క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అలాగే స్టేషన్‌ పరిధి గ్రామాలలో జరిగే నేరాల గురించి, సమస్యల గురించి ప్రజల జీవన విధానం గురించి, ఇక్కడ పరిస్థితిల గురించి, ముఖ్యమైన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రౌడీ షీటర్లు, అనుమానితులు, కేడీ, డిసిలు, మిస్సింగ్‌, ప్రాపర్టీ నేరాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ విజబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ నిర్వహించాలి గ్రామాలను సందర్శించి ప్రజలతో మమేకమై ప్రజల లో నమ్మకాన్ని కలిగించడంతో పాటు, పోలీస్‌ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలి. ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతోపాటు, మర్యాదపూర్వకంగా వారి సమస్య వినాల్సిన బాధ్యత అందరిపై ఉంది అని సీపీ అన్నారు. ప్రధాన రహదారి పై, గ్రామాలలో సిసి కెమెరాల వివరాలు, వాటి ఏర్పాటు, పనితీరు, వాటి ఆవశ్యకత ప్రజలకు వివరించి ఏర్పాటు కృషి చేయాలనీ సూచించారు. రోడ్డు ప్రమాదాలు నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తనిఖీల్లో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, ఏసీపీ ప్రకాష్, లక్షేట్టిపేట సీఐ రమణ మూర్తి, దండేపల్లి ఎస్‌.ఐ తైసీనుద్దీన్ పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :