Sunday, 13 September 2026 01:10:26 AM
# కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు..

మెదక్ పట్టణానికి 6 ఫ్రీజర్లు అందజేత...

మాజీ డిప్యూటీ స్పీకర్

Date : 26 January 2026 11:42 PM Views : 196

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు ఏం. పద్మ దేవేందర్ రెడ్డి మెదక్ పట్టణ ప్రజల సౌకర్యార్థం కోసం మాజీమంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఏం పద్మ దేవేందర్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ లు 6 ఫ్రీజర్ లను సోమవారం అందజేశారు. ఇందులో ముస్లిం మైనార్టీలకు 2, క్రిస్టియన్ లకు 1, పట్టణంలోని ఇతర కులస్తులందరికీ 3 ఫ్రీజర్లను అంద చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మెదక్ మున్సిపల్ కు ఒక వైకుంఠ రథం,రెండు ఫ్రీజర్లు అందజేశానని గుర్తు చేశారు. ఫ్రీజర్ లు చెడిపోవడంతో మరమ్మతుకు నోచుకోక మూలన పడ్డాయి అన్నారు. ఫలితంగా మెదక్ పట్టణంలో ఎవరైనా చనిపోతే ఫ్రీజర్ దొరకని పరిస్థితి నెలకొందనీ చెప్పారు.పట్టణంలో ఫ్రీజర్లు దొరికాక ప్రజల ఇబ్బందులను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే, తన్నీరు హరీష్ రావుదృష్టికి తీసుక వెళ్లినట్లు చెప్పారు. వెంటనే స్పందించిన ఆయన మెదక్ పట్టణానికి 6 ఫ్రీజర్లు మంజూరు చేశారాని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు ఎవరైనా సరే అవసరం ఉన్నవాళ్లు ఫ్రీజర్లు తీసుకువెళ్లి వినియోగించుకోవాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ మాట్లాడుతూ ఈ పంపిణి ఎన్నికల ప్రయోజనం కోసం కాదు. ప్రజల ఇబ్బందులను గుర్తించి పంపిణి చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో మండలాల వారిగా కూడా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుకి మాజీ ఎమ్మెల్సీ వారు హుస్సేన్కి పద్మ దేవేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల. మల్లికార్జున్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్లు వంజరి. జయరాజ్, సోహెల్, ఆర్కే శ్రీనివాస్, జ్యోతి కృష్ణ,నాయకులు సురేందర్ గౌడ్, జుబెర్ అహ్మద్, ఫాజిల్, షాకీర్, సాదిక్, సునీల్, సంతోష్, ఇమాదాడ్, ఇస్మాయిల్, శ్రీనివాస్, ఓమర్ ఫరూక్, మధు, అమీర్, కిరణ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :