Monday, 14 September 2026 07:23:49 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

పోడు భూముల సమస్యలపై ప్రభుత్వ వైఖరి ఖండించిన మాజీ ఎమ్మెల్యే...

Date : 19 May 2026 09:22 PM Views : 129

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పోడు భూముల సమస్యలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఖరిని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తీవ్రంగా ఖండించారు. మంగళవారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ పోడు భూముల సమస్యలపై ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. దశాబ్దాలుగా అడవులను ఆనుకుని జీవనం సాగిస్తున్న గిరిజనులు, పేద రైతులు సాగుచేస్తున్న పోడు భూములను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయడం దారుణమని అన్నారు. గత ముప్పై నుంచి నలభై సంవత్సరాలుగా కుటుంబాల జీవనాధారంగా ఉన్న పోడు భూములను రైతుల నుంచి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.రైతుల సమస్యలను అర్థం చేసుకోవాల్సిన ప్రభుత్వం, వారిపై ఒత్తిడి తీసుకురావడం బాధాకరమని పేర్కొన్నారు. అడవుల అభివృద్ధి పేరుతో రైతుల పొట్టకొట్టే చర్యలు ఆపాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోడు రైతుల సమస్యలను పరిష్కరించకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. గత ఏడాది పంటకాలంలో రైతులు భూముల్లో విత్తనాలు వేయకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్న ఘటనలను గుర్తుచేస్తూ, రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. సాగు చేయలేక అనేక కుటుంబాలు అప్పుల బారిన పడ్డాయని చెప్పారు. అలాగే, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పోడు రైతుల కష్టాలను గుర్తించి వారికి పోడు పట్టాలు అందించిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. గిరిజనులు, పేద రైతులకు భూమిపై హక్కులు కల్పించేందుకు గత ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోడు రైతుల్లో మళ్లీ భయాందోళనలు నెలకొన్నాయని, ఫారెస్ట్ అధికారులు తరచూ భూముల వద్దకు వెళ్లి రైతులను భయపెడుతున్నారని విమర్శించారు. రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం, వారి జీవనాధారాన్ని దెబ్బతీసే చర్యలు చేపట్టడం సరైంది కాదన్నారు. పోడు భూముల సమస్యను ప్రభుత్వం రాజకీయ కోణంలో కాకుండా మానవతా దృక్పథంతో చూడాలని కోనప్ప సూచించారు. తరతరాలుగా సాగుచేస్తున్న రైతులకు శాశ్వత హక్కులు కల్పించి, వారిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించి, సాగుకు ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :