ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో పాటు వరంగల్, కొత్తగూడెం, రామగుండం ఎయిర్ పోర్టులకు కు అనుమతులు రాగా, తాజాగా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు కూడా కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎంపీ గోడం నగేష్ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్ విడుదల చేశారు. త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభమవుతాయని ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కోసం మరో 10 వేల ఎకరాలను గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
Admin
E Nivas News