Saturday, 12 September 2026 09:25:50 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ..

Date : 02 September 2026 08:00 PM Views : 103

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెటిపేట మండలం వెంకటరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్యాధికారి నరేందర్ రావు ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ఇటిక్యాల సబ్ సెంటర్లు మిడిల్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ మౌనిక,ఆరోగ్య కార్యకర్త విజయ దర్శినితో ఉపకేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలను పరీక్షించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా గర్భవతులకు పిల్లలకు వ్యాక్సినేషన్ వివరములను తెలుసుకొని అదేవిధంగా ప్రతి వ్యాక్సినేషన్ కార్యక్రమమునకు ముందు పిల్లల వివరములను గర్భవతుల వివరాలు దగ్గర ఉంచుకోవాలని ఆశా కార్యకర్తలు ఇంటికి వెళ్లి వారికి తినిపించి వ్యాక్సినేషన్ చేయాలని ఆదేశించారు. అదే విధంగా జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అన్నివి కూడా 100% పూర్తి చేయాలని రోజువారి వివరములను వాక్సినేషన్ వివరములు నమోదు చేయాలని తెలిపారు. ముఖ్యంగా ఆరోగ్య కార్యకర్తలు యూవిన్ పోర్టల్ లో వివరములు నమోదు చేయకుంటే వాక్సినేషన్ వివరములు రిజిస్టర్ కావని కావున నమోదు చేయాలన్నారు. క్షయ వ్యాధి నియంత్రణ లో భాగంగా వ్యాధిగ్రస్తులను గుర్తించడం పరీక్షలు చేయడము మందులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. 14 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలందరికీ హెచ్పీవీ వ్యాక్సినేషన్ ఇప్పించి క్యాన్సర్ నుండి విముక్తి చేయాలని సూచించారు. అవగాహన కార్యక్రమాలు చేపట్టుతూ తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ఉపకేంద్రంలో సిబ్బంది అందుబాటులో ఉంటూ సమయపాలన పాటించాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. అదేవిధంగా వెంకట్రావుపేట ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యాధికారి డాక్టర్ సమత మరియు వైద్య సిబ్బంది నర్సింగ్ అధికారులు ఆరోగ్య కార్యకర్తలు సుప్రవేజర్లతో సమీక్ష చేసి ఆరోగ్య కార్యక్రమాలన్నీ నమోదు చేయాలని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవల పైన సంతృప్తి వ్యక్తం చేసినారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ను మందుల నిల్వలకు గదిని ఓపి ఇన్ పేషంట్ రూములను తనిఖీ చేసి శుభ్రత పాటించాలని సూచించారు. ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వనమోత్సవాన్ని పాటిస్తూ చెట్లు నాటారని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్, సిహెచ్ఓలు నామదేవ్ హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సేవలు అందిస్తూ ప్రజలు స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామపంచాయతీ మున్సిపల్ ఐసిడిఎస్ విద్యాశాఖ సమన్వయంతో ఆరోగ్య సేవలను అందించాలని ఆదేశించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :