ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : పెద్దపల్లి జిల్లా మంథనిలో మదర్ థెరిస్సా మహిళ పొదుపు సమితి ఆర్థిక అవకతవకలు/ పారదర్శకత లోపం పై చట్ట పరమైన విచారణ జరపాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఆర్టిఐ ద్వారా కోరినట్లు నామని హరీష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పొదుపు సంఘంలో జరుగుతున్న పలు అంశాలపై విచారణ జరపాలని ఆర్టిఐ దరఖాస్తులో కోరారు. మదర్ థెరిస్సా సంస్థకు సంబంధించిన అనుమతులు, పరిమితులు, పొదుపు సంస్థ ప్రారంభ తేది నుండి నేటి వరకు ఉన్న సభ్యుల సంఖ్య తెలుపాలన్నారు. పొదుపు సమితి లావాదేవీలు, రుణాలు ఇవ్వడం, వడ్డీ వసూళ్లపై అనుమానాలు ఉన్నాయన్నారు. క్రిస్టియన్ మిషనరీ కి సంబంధించిన లోడి సంస్థతో ఎలాంటి సంబంధంలేని మదర్ థెరిస్సా పొదుపు సమితి లావాదేవీలు ఆడిట్ జరుగుతున్నాయా లేదా అంశాలపై సమగ్ర విచారణ జరిపి బహిరంగపరచాలని కోరారు. తమది రిజిస్టర్డ్ సొసైటీ అని సొసైటీ నిబంధనలకు లోబడి లావాదేవీలు నిర్వహిస్తున్నామని మదర్ థెరిస్సా పొదుపు సమితి మేనేజర్ మేకల మల్లేశం తెలిపారు. తమ పొదుపు సంస్థ పై ఎవరికైనా, ఏమైనా అభ్యంతరాలు ఉంటే అన్ని వివరాలు వెల్లడిస్తామని మేనేజర్ మేకల మల్లేశం
Admin
E Nivas News