ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయకుండా 1000 రోజులుగా కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న తీరును నిరసిస్తూ, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం జన్నారం మండల కేంద్రంలో మహిళలకు ఇస్తామన్న 2500. పెంచుతామన్న పెన్షన్లు, కేసీఆర్ కిట్. కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్.(తులం బంగారం.) వృద్ధులు, వికలాంగులు, మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై నిరసన కార్యక్రమం ఉంటుందన్నారు. కావున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Admin
E Nivas News