ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని అంగన్‌వాడీల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను అమలు చేయాలని గురువారం మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం,కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టగా మంచి ఫలితాలను ఇచ్చిందని తెలిపారు.చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గుడ్లు, పాలు, ఇతర సరకుల సరఫరాలో నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్లను బ్లాక్లిస్టులోపెడతామని హెచ్చరించారు. చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందిస్తే ఆరోగ్యంగా ఉండడంతోపాటు చదువుపై కూడా శ్రద్ధగా దృష్టి పెడతారన్నారు. ప్రభుత్వం దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్నారు.
Admin
E Nivas News