ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : తాళం వేసి ఉన్న ఇళ్లను పగటిపూట రెక్కీ చేసి రాత్రి సమయంలో తాళాలు పగులగొట్టి బంగారు ఆభరణాలతో పాటు నగదును దొంగిలిస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్న జగిత్యాల జిల్లాకు చెందిన వనం రామును మంథని సీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం, రామగిరి పోలీసులు అరెస్ట్ చేసినట్లు మంథని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్ వెల్లడించారు. రామగిరి ఎస్సై టి.శ్రీనివాస్ తన సిబ్బందితో శనివారం గస్తీ నిర్వహిస్తున్న సమయంలో తాళం వేసి ఉన్న ఇళ్లను పరిశీలిస్తూ నడుచుకుంటూ తిరుగుతున్న నిందితుడిని గుర్తించారన్నారు. పోలీసులను చూసి నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా అతని ప్రవర్తనపై అనుమానం రావడంతో తనిఖీ చేయగా అతని వద్ద ఒక బటన్ కత్తి లభించగా నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా,తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలు చేసేందుకు వచ్చినట్లు అంగీకరించడంతో పాటు గతంలో తన సహచరులతో కలిసి పాల్పడిన పలు దొంగతనాల వివరాలను వెల్లడించినట్లు తెలిపారు. నిందితుడి నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని, దొంగతనాలకు సంబంధించిన ఆస్తి రికవరీతో పాటు ఇతర నిందితుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని ఏసీపీ తెలిపారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన మంథని సీఐ బి. స్వామి, రామగిరి ఎస్సై టి.శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుళ్ భార్గవ్, పోలీస్ కానిస్టేబుళ్లు డి.రమేష్, వి.అభిషేక్, బి.రాజ్‌కుమార్ లను ఏసీపీ మడత రమేష్ అభినందించారు.
Admin
E Nivas News