Thursday, 30 July 2026 12:29:14 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ప్రతిభ గలక్రీడాకారులను ప్రోత్సహిస్తాం

సిపి. అంబర్ కిషోర్ ఝా

Date : 23 February 2026 06:59 PM Views : 163

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : క్రీడల్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026 సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్స్‌లో హోరాహోరీగా నిర్వహించబడిన క్రీడోత్సవాలు రెండు రోజుల క్రితం ముగిశాయి. ఈ క్రీడల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను సోమవారం సిపి అభినందించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభకు కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరై, పతకాలు సాధించిన క్రీడాకారులను వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచినందుకు క్రీడాకారులను అభినందించారు. క్రీడలకు సమయం కేటాయించే పోలీస్ అధికారులకు పూర్తి స్థాయి సహకారం అందించబడుతుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలు సాధించి శాఖకు మరింత కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల్లో విజయం సాధించడం క్రమశిక్షణ, సమన్వయం, నిరంతర సాధన వల్లే సాధ్యమని పేర్కొంటూ, శాఖ తరఫున క్రీడాకారులకు అన్ని విధాల మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయని, విధి నిర్వహణలో క్రీడాస్ఫూర్తి ఎంతో అవసరమని తెలిపారు. 4వ తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ మీట్-2026లో కాలేశ్వరం జోన్ నుండి 150 మంది పాల్గొనగా, అందులో 30 మంది క్రీడాకారులు 23 పతకాలు సాధించారు. అందులో బంగారు పతకాలు 7, వెండి పతకాలు 8, కాంస్య పతకాలు 8 ఉన్నాయి. రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు చెందిన 15 మంది క్రీడాకారులు, ములుగు జిల్లా నుండి 5 మంది, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుండి 6 మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి 4 మంది పతకాలు సాధించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏవో శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ కృష్ణ, ఆర్‌ఐలు శేఖర్, పెద్దన్న, సీసీ హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: