ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రంలోని అన్ని రేషన్ కార్డుదారులు జులై 31లోపు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 76 శాతం రేషన్ కార్డులకు ఈ-కేవైసీ పూర్తికాగా మిగిలిన 24 శాతం కార్డుదారులవివరాలను అధికారులు రేషన్ డీలర్లకు పంపించారు. గడువులోపు ఈ-కేవైసీ పూర్తి చేయని కార్డులకు ఆగస్టు నెల నుంచి రేషన్ సరఫరా నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రాబోయే మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్న నేపథ్యంలో ఈ-కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులు రేషన్ కోల్పోయే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అందువల్ల అర్హులైన ప్రతి రేషన్ కార్డుదారుడు సమీప రేషన్ దుకాణం లేదా సంబంధిత కేంద్రంలో వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. ఆగస్టులోగా పూర్తి చేయకపోతే ఇబ్బందులు పడాల్సివస్తుంది అన్నారు.
Admin
E Nivas News