ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సదల్ పూర్ లో గల శాతవాహనుల కాలంనాటి శివాలయం మరియు భైరవదేవుని ఆలయాన్ని శుక్రవారం ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ దర్శన నిమిత్తం రాగా ఆలయ కమిటీ సభ్యులు డప్పు వాయిద్యాలు నడుమ జిల్లా ఎస్పీని ఘనంగా ఆహ్వానించారు. అనంతరం ఆలయంలో శివలింగానికి జిల్లా ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా పక్కనే ఉన్న భైరవదేవని దర్శించి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు జిల్లా ఎస్పీకి శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జైనథ్ సిఐ జి శ్రావణ్,బేల ఎస్ఐ ఎల్ ప్రవీణ్, ఆలయ కమిటీ సభ్యులు ఆడే శంకర్, కోరంగి వంశస్థులు, సర్పంచులు, తదితరులుపాల్గొన్నారు.
Admin
E Nivas News