ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాదా బైనమా, భూభారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వేగవంతం చేయాలని మంచిర్యాలజిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు సూచించారు. గురువారం మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కేటాయించిన భూ సంబంధిత అంశంపై విచారణ చేపట్టి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భూ సంబంధిత అంశంపై అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పెండింగ్‌లో ఉన్న సాదా బైనమా, భూభారతి దరఖాస్తులపై సమీక్ష నిర్వహించి, పెండింగ్ దరఖాస్తులను తొందరగా పరిష్కరించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం హాజీపూర్ మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా, భూ భారతి దరఖాస్తులను రికార్డులనుఅనుసరించి వేగంగా పరిష్కరించాలని తెలిపారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా గుర్తించిన అనామలీస్ కు నోటీసుల జారీ, తదుపరి చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కార్యాలయంలో పెండింగ్ దరఖాస్తులు అన్నింటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించి, సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భూ సంబంధిత దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News