ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఏసీబీ అధికారులకి మరో ఉన్నతాధికారి చిక్కారు. భారీ అవినీతి, అక్రమాస్తుల ఆరోప ణల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయం లో అడ్మిన్ అధికారి గా విధులు నిర్వహి స్తున్న శ్రీనివాస్ రెడ్డి, నివాసంలో గురువా రం ఉదయం నుండి ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అతడి బంధువులు, స్నేహితులకు చెందిన 15 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి, ఆస్తులు, నగదు, బంగారంపై శ్రీనివాస్ రెడ్డిని ఏసీబీ అధికా రులు ఆరా తీస్తున్న ట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ రెడ్డి గతంలో మహేశ్వరం, బాలా పూర్, శంషాబాద్ ఎమ్మార్వోగా విధులు నిర్వహించారు.
Admin
E Nivas News