Monday, 14 September 2026 09:55:11 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

డిగ్రీ కళాశాలలో ముగిసిన విద్యా వారోత్సవాలు..

Date : 17 May 2026 11:47 PM Views : 124

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మంచిర్యాల జిల్లాలక్షేట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వారం రోజులపాటు కొనసాగిన విద్యా వారోత్సవాలు ఆదివారం తోఘనంగా ముగిసాయి. కళాశాల ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ అధ్యక్షతలో జరిగిన కార్యక్రమంలో బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొని వారోత్సవాల ముగింపు వేడుకలు విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ మాట్లాడుతు విద్యావారోత్సవాల్లో గత వారం రోజుల పాటు కళాశాలలో జరిగిన కార్యక్రమాలపై నివేదిక సమర్పించారు. స్థానిక ప్రజా ప్రతినిధుల చేతులపై ప్రారంభమైన వారోత్సావాల్లో ఉచిత పి.జీ ఎంట్రన్స్ కోచింగ్ , యోగా శిక్షణ,గ్రంథాలయ జ్ఞానోత్సవం , కృత్రిమ మేధపై అవగాహన, ఉపన్యాసం, పూర్వ విద్యార్థుల సమావేశం, కళాశాల నుండి కాకతీయ యూనివర్సిటీలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మరియు ఉద్యోగాలు సాధించిన పూర్వ విద్యార్థులకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. కళాశాల నుండి ఉత్తమ ఫలితాలు సాధించిన అధ్యాపకులకు సన్మానం తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. మొత్తం ప్రభుత్వం సూచించిన అన్ని కార్యక్రమాలు చేపట్టామని విద్యా వారోత్సవాలు దిగ్విజయం కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సంస్థ అభివృద్ధికి ఉపయోగ పడుతుందని తెలిపారు. ముగింపు వేడుకల సందర్భముగా కళాశాల కల్చరల్ కో ఆర్డినేటర్ తన్నీరు సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్న్నాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. సంతోష్ , వైస్ ప్రిన్సిపాల్ సంతోష్ కుమార్ ఐక్యూఏసి కోఆర్డినేటర్ ప్రేమలత, అధ్యాపకులు శంకరయ్య, తిరుపతి, తన్నీరు సురేష్, లైబ్రేరియన్ నాగేశ్వర్, చంద్రశేఖర్, శ్రీనివాస్ సంధ్యారాణి, కవిత, మల్లయ్య, రాజ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్,నాగే0దర్, స్వామి శ్రీనివాస్, నిషాoత్ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :