ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : సికింద్రాబాద్–బల్లార్షా రైలు మార్గంలో, కాజీపేట వైపు ఎలక్ట్రిక్ పోల్ నంబర్ 261/12 వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేయగాప్రజల అభ్యర్థనను గుర్తించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వెంటనే స్పందించి రైల్వే అధికారిణి అశ్విని వైష్ణవ్ కి, దక్షిణ మధ్య రైల్వే జిఎం కి లేఖ పంపారు. రైల్వే శాఖ అధికారులు లొకేషన్‌ను పరిశీలించి, ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతి (సాంక్షన్) మంజూరు చేశారు. ఈ ఎఫ్ఓబీ నిర్మాణం పూర్తయితే హమాలివాడ, సూర్యనగర్, తిలక్‌నగర్, రాజీవ్‌నగర్, గోపాలవాడ, సప్తగిరి కాలనీ, అశోక్ రోడ్డు, వేముల బస్తీ, దొరగారి పల్లె ప్రాంత ప్రజలకు రాకపోకలు ఎంతో సులభతరం కానున్నాయి. ఈ పనులు వచ్చే ఏడాది డిసెంబర్ లోపే పూర్తవుతాయని ఎంపీ తెలిపారు. ప్రజల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న ఈ నిర్ణయం మంచిర్యాల పట్టణ అభివృద్ధికి మరో ముందడుగు అవుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తై ప్రజలకు ఉపయోగపడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా మన్నారు. ఈ మేరకు ఈ ప్రాంత ప్రజలు హర్షణ వ్యక్తం చేశారు.
Admin
E Nivas News