Sunday, 13 September 2026 02:46:16 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా... మార్చి 16న పోలింగ్..

Date : 20 February 2026 05:31 AM Views : 289

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలో మొన్నటికి మొన్న మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. అధికార కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు జరిగిన ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడిక మరోఎన్నికలు జరుగనున్నాయి. దీనికి అవసరమైన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది.ఏర్పాట్లనూ మొదలుపెట్టింది. రాజ్యసభ ఎన్నికలు ఇవి. త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలను భర్తీ చేయడానికి ఈ షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. తెలంగాణతో పాటు మొత్తం 10 రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 37 మంది సభ్యులు ఎన్నిక కానున్నారు. ఏప్రిల్ 9వ తేదీ నాటికి వివిధ రాష్ట్రాల నుండి మొత్తం 37 మంది సభ్యుల పదవీకాలం ముగియబోతోంది. వీరిలో తెలంగాణ నుండి డాక్టర్ అభిషేక్ మను సింఘ్వి, కేఆర్ సురేష్ రెడ్డి ఉన్నారు. మను సింఘ్వీ కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. సురేష్ రెడ్డిని బీఆర్ఎస్ నామినేట్ చేసింది. ఈ నెల 26వ తేదీ గురువారం నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి తేదీ మార్చి 5. ఆ మరుసటి రోజే నామినేషన్ల స్క్రూటినీఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 9వ తేదీ వరకు గడువు ఉంటుంది. 16వ తేదీన పోలింగ్. ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుండి ఓట్లను లెక్కిస్తారు. 20 నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. మొదటి విడతగా ఏప్రిల్ 2న మొత్తం 22 మంది సభ్యులు పదవీ విరమణ చేస్తారు. మహారాష్ట్ర నుండి డాక్టర్ భగవత్ కిషన్‌రావ్ కరద్, డాక్టర్ ఫౌజియా తహసీన్ అహ్మద్ ఖాన్, ప్రియాంక విక్రమ్ చతుర్వేది, శరద్‌చంద్ర గోవిందరావు పవార్, ధైర్యశీల్ మోహన్ పాటిల్, రజనీ అశోకరావు పాటిల్, రాందాస్ బందు అథవాలే, ఒడిశా నుండి మమతా మొహంతా, ముజిబుల్లా ఖాన్, సుజీత్ కుమార్, నిరంజన్ బిషి పదవీకాలం ముగియనుంది. తమిళనాడు నుండి ఎన్ఆర్ ఇళాంగో, పీ సెల్వరాసు, ఎం తంబిదురై, తిరుచ్చి శివ, డాక్టర్ కనిమొళి, ఎన్‌విఎన్ సోము, జీకే వాసన్ పదవీ విరమణ చేస్తారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రితబ్రత బెనర్జీ, సాకేత్ గోఖలే, బికాష్ రంజన్ భట్టాచార్య, సుబ్రతా బక్షి పదవీకాలం ముగుస్తుండగా, మౌసమ్ నూర్ స్థానం ఈ ఏడాది జనవరి 5 నుండే ఖాళీగా ఉంది.రెండవ విడతలో ఏప్రిల్ 9న మొత్తం 15 మంది సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అస్సాం నుండి రామేశ్వర్ తేలి, భువనేశ్వర్ కలిత, అజిత్ కుమార్ భూయాన్ పదవీ విరమణ చేస్తారు. బీహార్ నుండి అమరేంద్ర ధారీ సింగ్, ప్రేమ్ చంద్ గుప్తా, రామ్‌నాథ్ ఠాకూర్, ఉపేంద్ర కుష్వాహా, హరివంశీ నారాయణ్ సింగ్ పదవీకాలం ముగియనుంది. ఛత్తీస్‌గఢ్ నుండి కవి తేజ్‌పాల్ సింగ్ తులసి, ఫూలో దేవి నేథామ్, హర్యానా నుండి కిరణ్ చౌదరి, రామ్ చందర్ జాంగ్రా, హిమాచల్ ప్రదేశ్ నుండి ఇందు బాలా గోస్వామి పదవీ విరమణ చేస్తారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :