Friday, 11 September 2026 10:11:12 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

ఈనెల 9వ తేదీన నంద్యాలలో జరిగే ఏపీఎంఎఫ్ జిల్లా మహాసభల కరపత్రాలను విడుదల చేసిన జిల్లా సోషల్ మీడియా ప్రతినిధులు

Date : 01 September 2026 01:33 PM Views : 129

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఈనెల 9వ తేదీన నంద్యాలలో జరిగే ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ (ఏపీఎంఎఫ్) జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ నందికొట్కూరు కో- కన్వీనర్ బి.పక్కిరయ్య ఆధ్వర్యంలో జిల్లా సోషల్ మీడియా ప్రతినిధులు ఎస్.షర్పద్దీన్ అలి, జి.గోవిందు, భావన వినోద్ కుమార్, కే.అంకన్న, కే.మోషే, బి.స్వాములు, షేక్.మహమ్మద్ రఫీ, షేక్.మహబూబ్ బాషా, జి.సాయి కృష్ణ, రాయపాటి మురళీమోహన్, జి.ప్రవీణ్ కుమార్, డక్కా.శ్రీకాంత్, ఎం.వెంకట రమేష్, ఎం.రాము గౌడ్, వై.శివారెడ్డి, ముద్రగడ.శ్రీనివాసరావు, నాగ స్వామి నాయక్, బలరాం, జూపాడుబంగ్లా మధు, తదితరులు పాములు పాడు ప్రెస్ క్లబ్ లో కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ నంద్యాలలో జరిగే మహాసభలో మీడియా జర్నలిస్టులకు ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇచ్చి, ఇల్లు కట్టించి ఇవ్వాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, 50 సంవత్సరాలు నిండిన జర్నలిస్టులకు సామాజిక పెన్షన్లు మంజూరు చేయాలని, గతంలో ఉన్న మాదిరిగా రైల్వే పాసులు మంజూరు చేయాలని, తదితర అన్ని అంశాలపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుందనీ అన్నారు. ఈ మహాసభకు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, వివిధ సంస్థల చైర్మన్లు, తదితర ప్రముఖులు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారన్నారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ (ఏపీఎమ్ఎఫ్) వ్యవస్థాపకులు & రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ.ఢిల్లీ బాబు రెడ్డి, ఏపీఎంఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.మద్దిలేటి, నంద్యాల జిల్లా ఆహ్వాన కమిటీ కన్వీనర్ పి.నాగవర్ధన్ రెడ్డి, కో కన్వీనర్ లు పి.శివకుమార్ రెడ్డి, సీ.ఎం.శ్రీనివాసులు, మరియు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కమిటీల సభ్యులు హాజరవుతారన్నారు. కాబట్టి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరూ పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని, ఆహ్వాన కమిటీ కోరింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :