Wednesday, 29 July 2026 12:04:51 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

మాస్టర్ ట్రైనర్ల ఎంపికలో పారదర్శకత పాటించాలి..

పిఆర్టియూ జిల్లా నాయకులు

Date : 08 January 2026 05:32 PM Views : 191

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : ఎన్నికల విధుల శిక్షణ మాస్టర్ ట్రైనర్ల ఎంపి కలో పారదర్శకత పాటించాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (పీఆర్టీయూ-టీఎస్) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మిర్యాల సతీష్ రెడ్డి, చాగర్లముడి శ్రీధర్ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పొ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల శిక్షణలో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు మాస్టర్ ట్రైనర్లుగా వ్యవహరించారని, రాబోయే మునిసిపల్, జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల శిక్షణ విధుల నుంచి వారిని మినహాయించాలని కోరారు. మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం అవుతాయని, ఉన్నత పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్లను మాస్టర్ ట్రైనర్లుగా నియమించడం వలన విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఎస్సెస్సీ విద్యార్థుల భవిష్య త్తును దృష్టిలో పెట్టుకొని గతంలో 2018-2019 శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలల్లో మాస్టర్ ట్రైనర్లుగా విధులు నిర్వహించిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. ఒకే ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయులను మాస్టర్ ట్రైనర్లుగా ఎంపిక చేయడం వలన ఇతర ప్రాంత ఉపాధ్యాయులకు నష్టం జరుగుతుందని మున్సిపల్,యంపిటీసి,జెడ్పీటిసి ఎన్నికలకు, జనగణనకు శిక్షణ కొరకు మాస్టర్ ట్రైనర్ ల ఎంపికలో అన్ని మండలాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ మరిపెడ మండల ప్రధాన కార్యదర్శి లింగాల మహేష్ గౌడ్, సంఘ బాధ్యులు దోమల లింగన్న, వెంకట్ రెడ్డి, కరుణాకర్, హాల్య, నాగరాజు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :