ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : బాల్య వివాహాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకొని బాల్య వివాహాలపై అవగాహన కల్పించేల చర్యలు తీసుకోవాలని మంథని సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకాధికారిణి కార్యాలయంలో సిడిపిఓ కు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్ వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో పలు గ్రామాలలో అనేక బాల్యవివాహాలు జరుగుతున్నప్పటికిని బాల్య వివాహాల పట్ల కనీస అవగాహన కల్పించడం లేదన్నారు. సోషల్ మీడియా యుగంలో కూడా కొన్ని మారుమూల గ్రామాల్లో గుట్టు సప్పుడు కాకుండా బాల్యవివాహాలను జరుపుతున్నారని, ఇలాంటి విషయాల పట్ల ఏ ఒక్క అంగన్వాడీ టీచర్ కూడా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించడం లేదని ఆరోపించారు. గ్రామాల్లో కొందరు పేరుమోసిన ప్రజా ప్రతినిధులు సైతం బాల్యవివాహాలను ప్రోత్సహిస్తున్నట్టుగా సమాచారం ఉందన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఆడపిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించకపోవడం వల్లనే బాల్యవివాహాలు జరుగుతున్నాయని, ఇలాంటి బాల్యవివాహాలను ప్రోత్సహిస్తున్న వారిని గుర్తించి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Admin
E Nivas News