ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మండల కేంద్రాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలం అయినట్లు తెలుస్తుంది. మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటపట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం అధికారులు ప్రజావాణి నిర్వహించారు. కానీ పిర్యాదులు ఐదు మాత్రమే వచ్చాయి. దీనికి ప్రజల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించక పోవడంతో పిర్యాదులు రాలేదు. దీంతో ఇంతమంది అధికారులు తమ సమయం వెచ్చించడంతో వృధా అయిపోయింది. ఇప్పటికైనా అధికారులు మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు. ముందుగా సమాచారాన్ని ఇస్తే తప్పకుండా పలు సమస్యలతో తాము రావడం జరుగుతుందన్నారు.
Admin
E Nivas News