Friday, 11 September 2026 09:06:04 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

పత్తి కొనుగోలులో ప్రైవేట్ వ్యాపారుల దోపిడి...

పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు

Date : 10 November 2025 08:16 PM Views : 301

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులు వ్యాపారుల చేతుల్లో నిలువు దోపిడీకి గురి అవుతున్నారు. పత్తి సీజన్లో అధిక వర్షాల కారణంగా పంట దిగుబడి రాక రైతులు నష్టపోయిన విషయం అధికారులకు తెలిసిందే. కానీ రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించు కోకుండా, అధిక తేమ శాతం పేరుతో పత్తి కొనుగోలు చేయక పోవడం తో, రైతులకు గిట్టుబాటు ధర రాక మరింత నష్ట పోతున్నారు. ఇదే అదును చూసి ప్రైవేట్ వ్యాపారస్తులు తక్కువ ధర కు పత్తి తీసుకుంటు నిలువు దోపిడీ చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులు గాని, తునికలా శాఖ అధికారులు గాని ప్రైవేట్ వ్యాపారస్తుల వైపు చూడడం లేదు. అసలు తూకం వేసే కాంటాలు తనిఖీ చెస్తూన్నారో, లేదో తెలియడం లేదని పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంటాల రూపంలో దోపిడీ జరుగు తున్న,విచ్చలవిడిగా కాంటాలు పెట్టి పత్తి కొనుగోలు చేస్తున్న తునికలా శాఖ అధికారులు పట్టించు కోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు అధిక వర్షాలు,, ఇంకోవైపు నిలువుదోపిడి, మరొక వైపు తనిఖీ లేని దోపిడీ చేయడంతో రైతులు నష్ట పోతున్న ప్రభుత్వాలు పట్టించు కోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కపాస్ కిసాన్ యాప్ తీసుకొచ్చి రైతులకు మరింత ఇబ్బంది గా మారింది, స్లాట్ బుక్ చేసుకొని పోతే అధిక తేమ ఉందని రిజెక్ట్ చేస్తున్నారని వాపోతున్నారు.ఈ యాప్ లో తేమ శాతం పెట్టి ఉండాల్సింది, ఇది కూడా ఒక రకమైన దోపిడీ అంటున్నారు. కనీసం ఈ ఏడాది పత్తి ధర రూ 12000 చేయాలనీ డిమాండ్ చేస్తూ,దోపిడీకి గురి చేస్తున్న ప్రైవేట్ వ్యాపారుల నుండి రైతులను కాపాడాలని అలాగే ఎలాంటి షరతులు లేకుండా, తేమశాతం చూడకుండా ఎకరానికి ఏడు క్వింటల్ అనే నిబంధన తీసివేసి పత్తి కొనుగోలు చేయాలనీ రైతులు డిమాండ్ చేస్తున్నారు. పత్తి మిల్లుల వద్ద రోజుల తరబడి వ్యాన్లలో, ట్రాక్టర్లలో, ఎడ్లబండ్లలో పత్తిని తీసుకువచ్చిన అధికారులు గాని ఎటువైపు చూడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఆధునిక భావించిన వ్యాపారులు తమ వద్దకు వచ్చి పత్తి కొనుగోలు చేస్తామని నెట్ డబ్బులు ఇస్తామని అనడంతో చేసేదిలేక కొందరు రైతులు అమ్ముతున్నారని తెలిపారు. అలాగే రోజుకు వ్యాన్లకు ట్రాక్టర్లకు కిరాయి కట్టే ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో పత్తి విక్రయించగా వచ్చిన డబ్బులన్నీ కిరాయిలకే సరిపోతాయన్న ఉద్దేశంతో దళారులకు7,8 వేల రూపాయ అమ్మడం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సీసీఐ అధికారుల పని తీరుపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో పత్తి రైతులు కోరుతున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :