Tuesday, 28 July 2026 11:39:58 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలి

సిపి.అంబర్ కిషోర్ ఝా

Date : 16 October 2025 08:30 PM Views : 267

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి భరోసా కల్పించాలి అని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్‌ కమీషనరేట్ మంచిర్యాల జోన్ హాజిపూర్ పోలీస్‌ స్టేషన్‌ను గురువారం తనిఖీ చేశారు. తనిఖీలకై పోలీస్‌ స్టేషన్‌ చేరుకున్న పోలీస్‌ కమిషనర్‌కు పోలీస్ అధికారులు పూలమొక్కలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ సిబ్బంది తో మాట్లాడి వారి విధులు, పనితీరు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా సీపీ పోలీస్‌ స్టేషన్‌ రిసెప్షన్‌, సిసిటిఎన్‌ఎస్‌ విభాగాల పనీతీరును సంబంధిత పోలీస్‌ సిబ్బందిని శాఖపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా అత్యవసర సమయంలో కంట్రోల్ రూమ్ కి సమాచారం సెట్ ద్వారా గురించి రిసెప్షన్ సిబ్బంది తో కమ్యూనికేషన్ సెట్ ద్వారా కంట్రోల్ రూమ్ కి మాట్లాడించడం జరిగింది. తనిఖీలో భాగంగా పోలీస్‌ స్టేషన్‌ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేయడంతో పాటు, పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులకు సంబంధించి పోలీస్‌ కమిషనర్‌ క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అలాగే స్టేషన్‌ పరిధి గ్రామాలలో జరిగే నేరాల గురించి, సమస్యల గురించి ప్రజల జీవన విధానం గురించి, ఇక్కడ పరిస్థితిల గురించి, ముఖ్యమైన ప్రాజెక్టు లు గురించి అడిగి తెలుసుకున్నారు. రౌడీ షీటర్లు, అనుమానితులు, కేడీ,డిసిలు, మిస్సింగ్‌, ప్రాపర్టీ నేరాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ విజబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ నిర్వహించాలి గ్రామాలను సందర్శించి ప్రజలతో మమేకమై ప్రజల లో నమ్మకాన్ని కలిగించడంతో పాటు, పోలీస్‌ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలి. ప్రతి పోలీస్‌ ఉద్యోగి నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించాలి. ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతోపాటు, మర్యాదపూర్వకంగా వారి సమస్య వినాల్సిన బాధ్యత అందరిపై ఉంది అని సీపీ అన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తనిఖీల అనంతరం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. ఈ తనిఖీల్లో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్., ఏసీపీ ప్రకాష్, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ కుమార్, ఎస్‌.ఐ స్వరూప్ రాజ్ పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: