ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అన్నారం గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదం రెండు కుటుంబాలను తీవ్రంగా దెబ్బతీసింది. అగ్నికీలల్లో రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంగళవారం ఘటనపై సమాచారం అందుకున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వెంటనే స్పందించారు. స్థానిక ఎస్సైతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించేందుకు అధికారులను ఆదేశించి, ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
Admin
E Nivas News