ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా స్థాయిలో ఫిబ్రవరి 7న జరిగిన సీఎం కప్ క్రీడా పోటీలలో మంచిర్యాల పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ కళాశాల ( బాలుర ) నుండి 12 మంది విద్యార్థులు వారి యొక్క ప్రతిభను కనబరిచి వివిధ క్రీడా అంశాలలో పథకాలను సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. పురుషోత్తం సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. అథ్లెటిక్స్ విభాగంలో 18 సంవత్సరాల బాలుర కేటగిరీలో కే.అమిత్ 110మీటర్స్ హార్డీల్స్ గోల్డ్ మెడల్, పి సిద్దార్థ 1500 మీటర్స్ సిల్వర్ మెడల్, అదేవిధంగా 20 సంవత్సరాల బాలుర విభాగంలో ఆర్ అరుణ్ 1500 మీటర్లలో గోల్డ్ మెడల్ & 3000 మీటర్స్ లో సిల్వర్ మెడల్, బి వివేక్ 100 మీటర్స్ లో గోల్డ్ మెడల్,కే సందీప్ 800 మీటర్స్ గోల్డ్ మెడల్ & 1500 మీటర్స్ సిల్వర్ మెడల్, పి ప్రణయ్ 200 మీటర్స్ సిల్వర్ మెడల్, బి కిషోర్ 3000 మీటర్స్ గోల్డ్ మెడల్ &1500 మీటర్స్ సిల్వర్ మెడల్, మరియు సీనియర్ మెన్ విభాగంలో క్యారం క్రీడ లో సింగిల్స్ విభాగంలో పి.నితిన్ గోల్డ్ మెడల్, అదేవిధంగా డబల్స్ విభాగంలో బి.గణేష్, ఎన్.నితిన్ గోల్డ్ మెడల్ ఎల్ గణపతి, ఎన్ సచిన్ సిల్వర్ మెడల్స్ సాధించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పురుషోత్తం తెలిపారు . పథకాలు గెలుపొందిన క్రీడాకారులను, ఫిజికల్ డైరెక్టర్ కొట్టే దేవేందర్ ని ఆదిలాబాద్ ఆర్.సి.ఓ. సేరు శ్రీధర్,కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. పురుషోత్తం, అధ్యాపకులు అభినందించారు.
Admin
E Nivas News