Sunday, 13 September 2026 12:29:41 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

ప్రతి రంగాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజా పాలన సాగిస్తున్నాం...

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్

Date : 05 July 2026 10:57 PM Views : 102

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రంలోని ప్రతి రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజా పాలన కొనసాగిస్తున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ తెలిపారు.ఆదివారం మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల సంక్షేమంలో భాగంగా ప్రతి రంగంపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మండల కేంద్రంలో మురుగు కాలువ నిర్మాణ పనులనుప్రారంభించడం జరిగిందని, 143 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందించడం జరిగిందని తెలిపారు. అర్హులైన పెంకుటిల్లు ఉన్నవారికి, సొంత స్థలం కలిగిన వారికి ఇందిరమ్మ ఇండ్ల పథకం వర్తింప చేయడం జరుగుతుందని తెలిపారు. అర్హులందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందని, రేషన్ కార్డులు జారీ చేసి చౌక ధరల దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అందించేలా క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నామని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గ పరిధిలో పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో 36 కోట్ల రూపాయలతో 56 కిలోమీటర్ల మేర రహదారులు, రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో 63 కోట్ల రూపాయల వ్యయంతో రహదారులునిర్మించడం జరుగుతుందని, భీమారం మండల పరిధిలో 6 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అమృత్ 2.0 పథకం క్రింద ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా నిరంతరం త్రాగునీటి సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సుమారు 100 కోట్ల రూపాయల వ్యయంతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనంపై కొందరు ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలలో ఆందోళనలు కలిగిస్తున్నారని, ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని కఠిన చర్యలు చేపడతామని తెలిపారు. చెన్నూర్ పట్టణంలో రహదారి విస్తరణలో వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని, 1 కోటి 60 లక్షల రూపాయల డి.ఎం.ఎఫ్.టి నిధులతో బైపాస్ రోడ్డు నిర్మించడం జరుగుతుందని, 1 కోటి 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న 20 షాపులలో పేద వ్యాపారస్తులకు ప్రాధాన్యత ఇచ్చి కేటాయించడం జరుగుతుందని తెలిపారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ 12 కోట్ల రూపాయల సి.ఎస్.ఆర్. నిధులతో చెన్నూర్ నియోజకవర్గంలో రహదారులు, మురుగు కాలువల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడంతో పాటు అన్ని గ్రామాలలో రహదారులు, మురుగు కాలువల వ్యవస్థ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సి.సి. మురుగు కాలువలలో మ్యాజిక్ సోక్ ఫీట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, తద్వారా భూగర్భ జల శాతాన్ని పెంపొందించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. డి ఎం ఎఫ్ టి, సి ఎస్ ఆర్ నిధులతో భీమారంలో అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మైనారిటీ సంక్షేమ వసతి గృహంలో మధ్యాహ్న భోజనం విషయంలో ఏర్పడిన గందరగోళంలో ఎలాంటి వాస్తవం లేదని, కొంతమంది ఉద్దేశపూర్వకంగా పిల్లలతో అబద్ధాలు చెప్పించారని, సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ చట్టం ప్రకారం చర్యలుతీసుకుంటామని తెలిపారు. విద్యారంగంలో మంచిర్యాల జిల్లా 3వ స్థానంలో ఉందని, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు ఇతర ప్రభుత్వ సంబంధిత విద్యా సంస్థలలో ఈ సంవత్సరం నో అడ్మిషన్ బోర్డులు పెట్టడం జరిగిందని తెలిపారు. ఈ విద్యాసంవత్సరంలో 3 వేల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలలో చేరారని తెలిపారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధి ప ప్రత్యేక దృష్టి సారిస్తుందని, విద్యాసంస్థలలో సి.సి. కెమెరాల తో పర్యవేక్షించడం జరుగుతుందని, విద్యార్థులకు 200 శాతం కాస్మోటిక్, 40 శాతం డైట్ చార్జీలు పెంచి అందించడం జరుగుతుందని, కస్తూరిబా గాంధీ బాలికలవిద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం భోజనశాలలు, అదనపు తరగతి గదులు నిర్మించడం జరుగుతుందని, ఆర్.ఓ. ప్లాంట్లు ఏర్పాటుచేసి శుద్ధమైన త్రాగునీటిని అందిస్తున్నామని తెలిపారు.అనంతరం చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారు నిర్మించుకున్న ఇంటిని జిల్లా కలెక్టర్, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గానికి 3 వేల 500 ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, ఇప్పుడు మరో 2 వేల ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, అర్హత గల ప్రతి ఒక్కరికి కేటాయించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో పెంకుటిల్లు లేకుండా ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండే విధంగా ప్రభుత్వం అర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తుందని, పెంకుటిల్లు గల అర్జీదారులు చేసుకున్న దరఖాస్తును మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పరిశీలించి ఫోటోలు తీసుకుని అర్హత ప్రమాణాలు పరిశీలించి ఇల్లు కేటాయించాలని తెలిపారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా అరికట్టడంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: