ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని మండలం రచ్చపల్లి గ్రామంలో డాక్టర్ చెన్న గోపి వారి సారధ్యంలో ఆయుర్వేదంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనారోగ్య సమస్యలకి కారణాలు రసాయన పదార్ధాలతో కూడిన వస్తువులు వాడటం వలన తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని సైడ్ ఎఫెక్ట్స్ ప్రమాదం ఉందని చిన్నపిల్లలో హార్మోనల్ ప్రభావితమైన సమస్యలు, పెద్దవారిలో షుగర్, బీపీ,కీళ్ళనొప్పులు, రక్త హీనత. లాంటి ప్రమాదకర వ్యాధులు సోకుతున్నాయని, గ్రామ ప్రజలకు, ఐ ఎమ్ సి, వారు ప్రజలకు అవగాహన చేసారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చెల్లోజు శ్రీనివాస్, రాజు, రాజేందర్, స్వామి, పాల్గొన్నారు.
Admin
E Nivas News