ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జగిత్యాల జిల్లాకోరుట్ల మండలం మాదాపూర్ భార్యను కత్తితో హత్య చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు ప్రాథమికంగా తెలిపిన వివరాల ప్రకారం8 నెలల క్రితం కోరుట్లకు చెందిన చిత్తరి హరిబాబు, మాదాపూర్ కు చెందిన వైష్ణవి ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి మాదాపూర్ లోనే నివాసముంటున్నారు. హరిబాబు ప్రభుత్వ ఆస్పత్రిలో ఒప్పంద పద్ధతిలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వైష్ణవి రీల్స్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తోంది. గత కొద్దిరోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం వేకువజామున 4 గంటలకు వైష్ణవిపై హరిబాబు కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడినుంచిపరారయ్యాడు. ఉదయం కుటుంబసభ్యులు చూసేసరికి రక్తపు మడుగులో వైష్ణవి పడి ఉంది. పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్య 4 నెల గర్భవతి అని తెలిసిన కూడా హత్య చేయడం పట్ల కుటుంబ సభ్యులు నిందితున్ని పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Admin
E Nivas News