ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా నుండితెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో మంచిర్యాల జిల్లాకు చెందిన పలువురు యువకులు ఆదివారం పెద్ద ఎత్తున ఆ పార్టీలో చేరారు. మంచిర్యాల జిల్లా భీమిని మండలం నుండి జాగృతి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మేడి. రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ భారీ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా కవితక్క వారికి జాగృతి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎటకారి. అజయ్, రాపల్లి. తిరుపతి, ఎటకారి. సత్తయ్య, పెసరి. వినోద్, బొగ్గుల. విక్రమ్, పెసరి. అంజన్న, ఎటకారి. శ్రీశైలం, జైపూర్ మండలానికి చెందిన కారుపకాల. రాకేష్, చిప్పకుర్తి. సంపత్ తదితరులు తెలంగాణ జాగృతిలో చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మేడి రాజశేఖర్ మాట్లాడుతూ కవితక్క నాయకత్వంలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు, అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు రవి రాథోడ్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News