Friday, 11 September 2026 09:34:13 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

చివరకు ఎటు పోతుందో లోకం..! ప్రిన్సిపాల్ ని చంపిన విద్యార్థులు..

Date : 20 August 2026 09:56 PM Views : 106

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మన ఇంట్లో పెరుగుతున్న పిల్లలు ఎలాంటి వారు, ఏం చేస్తున్నారో అనేది తల్లిదండ్రులు గమనిస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. పాఠాలు చెప్పిన గురువునే, డబ్బుల కోసం ఇద్దరు పదో తరగతి విద్యార్థులు దారుణంగా కత్తితో పొడిచి చంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న చెడు వ్యసనాలు, గంజాయి సంస్కృతి ఎంతటి దారుణాలకు ఒడిగడుతుందో ఈ సంచలన ఘటన ప్రత్యక్ష సాక్షంగా నిలిచింది. పోలీసుల కథనం ప్రకారం.. 4హత్యకు పాల్పడిన ఇద్దరు పదో తరగతి విద్యార్థులు గంజాయికి తీవ్రంగా అలవాటు పడ్డారు. విచ్చలవిడిగా జల్సాలు చేయడానికి డబ్బులు సరిపోకపోవడంతో, తమ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి ఇంట్లో చోరీ చేయాలని పథకం వేశారు. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్రిన్సిపల్ రూపారెడ్డి స్కూల్ ముగించుకుని ఇంటికి బయలుదేరారు. ఆమె ఇంటికి చేరుకోవడానికి ముందే నిందితులు గోడ దూకి లోపలికి చొరబడ్డారు. రూపారెడ్డి తాళం తీసి లోపలికి ప్రవేశించిన సమయంలో,నిందితులు వంటగదిలో దాక్కున్నారు. ఆమె ఫ్రెష్ అయి బెడ్రూమ్ లోకి వెళ్లగానే వెనక నుంచి అటాక్ చేసి, కత్తితో ఏకంగా 27 సార్లు అతి దారుణంగా పొడిచి చంపేశారు. నగదుతో పరారీ.. హైదరాబాద్ లో జల్సాలు... హత్య అనంతరం రూపారెడ్డి హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న రూ.2 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులకు చిక్కకుండా, సీసీటీవీ కెమెరాలలో ఎక్కడా పడకుండా తీవ్ర జాగ్రత్తలు తీసుకుంటూ అక్కడి నుంచి పరారయ్యారు. ఆ డబ్బుతో హైదరాబాద్ చేరుకుని విచ్చలవిడిగా జల్సాలు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను ఎట్టకేలకు గుర్తించి, ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేశారు. చదువు చెప్పి ప్రయోజకులను చేయాల్సిన గురువునే డబ్బుల కోసం దారుణంగా హత్య చేసిన ఈ ఘటన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తీవ్ర దిగ్భ్రాంతిని, తీవ్ర కలకలాన్ని రేకెత్తించింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: